ఉదయం వేళ సూర్యరశ్మిలో నడిస్తే?

శనివారం, 17 జూన్ 2023 (15:48 IST)
ఈ రోజుల్లో ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలనుకున్నా చూపలేని పరిస్థితులు వుంటున్నాయి. పని ఒత్తిడి విపరీతమవుతోంది. ఐనప్పటికీ ఉదయాన్నే సూర్యరశ్మి వెలుతురులో కాస్తంత నడిస్తే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకుందాము. ఉదయాన్నే సూర్యరశ్మిలో నడిస్తే విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుచుకునేందుకు రోజూ సూర్యరశ్మిలో నడక మేలు చేస్తుంది.
 
ఉదయం వేళ సూర్యరశ్మి కింద నడుస్తుంటే ఊబకాయాన్ని నివారించవచ్చు. చర్మ సమస్యలను క్లియర్ చేయడంలో సూర్యరశ్మి కింద నడక మేలు చేస్తుంది. ఆటో ఇమ్యూన్ వ్యాధి ప్రమాదాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు ఈ నడక ఎంతో దోహదపడుతుంది. రక్తపోటును తగ్గించడంలో సూర్యరశ్మిలో నడక కీలక పాత్ర పోషిస్తుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు