అవును. తెల్లటి బియ్యం తింటే బరువు పెరిగిపోతారట.. ఈ బియ్యంలో పీచు పదార్థాలు లేనందువల్ల తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి, రక్తంలోనికి ఒకేసారి చేరిపోతుంది. దాంతో శరీరం ఈ శక్తి అంతటిని కొవ్వుగా మార్చివేస్తుంది. అదే పీచు పదార్థాలుంటే ఈ ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. అందుకే తెల్లటి బియ్యాన్ని రోజులో ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
తెల్లటి బియ్యంలో శరీరానికి బలాన్నిచ్చే బి విటమిన్‌లు సరిగ్గా వుండవు. ఫలితంగా అలసి పోవడం, త్వరగా నీరసం రావడం, కష్టపడి పనిచేయలేక పోవడం మొదలైన ఇబ్బందులు తప్పవు. అందుకే దంపుడు బియ్యాన్ని ఉపయోగించాలని వారు చెప్తున్నారు.