పిల్లలు పుట్టాక మహిళల్లో శృంగార కోర్కెలు తగ్గడానికి కారణమిదే!

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (16:36 IST)
సాధారణంగా పిల్లలు పుట్టిన తర్వాత మహిళలో శృంగార భావనలు చాలా మేరకు తగ్గిపోతుంటాయి. భర్త ఎంత ప్రాధేయపడినా భార్య మాత్రం అందుకు సంసిద్ధత వ్యక్తం చేయదు. ఈ పరిస్థితి మెజార్టీ మహిళల్లో ఉంటుంది. 
 
ఇదిలావుండగా, మహిళల్లో శృంగార భావనలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయనే విషయం మీద యూనివర్సిటీ ఆఫ్‌ మిచిగాన్‌ సైంటిస్టులు పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు చేసిన పరిశోధనల్లో ప్రసవం జరిగాక, ముఖ్యంగా పిల్లలకు పాలిస్తున్న సమయంలో మహిళల్లో శృంగార వాంఛలు తగ్గు ముఖం పడతాయని తేలింది. 
 
వాస్తవానికి మహిళల్లో శృంగార భావనలు మొలకెత్తడానికి వారిలో ఉండే సెక్స్‌ హార్మోన్‌ ఈస్ట్రోజన్‌ కారణమనే విషయం తెలిసిందే. అయితే మహిళలు బ్రెస్ట్‌ ఫీడింగ్‌ చేసే సమయంలో బ్రెస్ట్‌ మిల్క్‌తోపాటు ఈస్ట్రోజన్‌ కూడా బయటకు వెళ్లిపోతుందట. దీంతో ఆ సమయంలో వారిలో ఆ భావనలు పూర్తిగా తగ్గిపోతాయట. అందుకే ఈ పరిస్థితి ఏర్పడుతుందని పరిశోధకులు చెపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి