టమోటాల గురించి తెలుసుకోవాల్సిన విషయం

మంగళవారం, 19 నవంబరు 2019 (20:57 IST)
టమోటాలలోని విత్తనాలు మనిషి ఆయుష్షును పెంచుతాయని బ్రిటన్ వైద్యులు తెలిపారు. టమోటాలోని విత్తనాల్లో ప్రకృతిపరమైన ఔషధం ఉందని, దీనికి ఫ్రూట్ ఫ్లో అని వారు నామకరణం చేసినట్లు వెల్లడించారు. టమోటా రసంతోపాటు అందులోని విత్తనాలు మనిషి శరీరంలోని రక్తాన్ని చిక్కబడకుండా చేస్తుందంటున్నారు పరిశోధకులు.
 
టమోటా రసం రంగులేనిదిగా ఉంటుందని, రుచిహీనంగాను ఉంటుందని తమ పరిశోధనల్లో తేలిందని పరిశోధకులు తెలిపారు. ఈ పదార్థం రక్త ప్రసరణలో బాగా ఉపయోగపడుతుందని వారు వివరించారు. దీంతోపాటు రక్తకణాలు మృతకణాలుగా మారకుండా చేసే గుణం ఇందులో వుందని వారు తెలిపారు. 
 
టమోటా రసం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. టమోటా విత్తనాలు తీసుకోవడం వలన మనిషి ధూమపానం, మద్యపానం, ఒత్తిడి, శరీరంలో కొవ్వు పెరిగిపోవడంతో రక్తంలో వచ్చే మార్పులను ఛేదిస్తుంది. ఈ విత్తనాల వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు