"ఆయుష్‌"పై ప్రజల్లో అవగాహన అవసరం: జీఏ.రాజ్‌కుమార్

గురువారం, 22 అక్టోబరు 2009 (18:18 IST)
Srini
WD
ఇండియన్ మెడిసన్ అండ్ హోమియోపతి (ఆయుష్‌)పై ప్రజల్లో అవగాహన మరింతగా కల్పించాల్సి ఉందని తమిళనాడు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇండియన్ మెడిసన్ అండ్ హోమియోపతి డిపార్ట్‌మెంట్ డైరక్టర్ జీఏ.రాజ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. దీనిపై ఆయన గురువారం చెన్నయ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. క్రీస్తుపూర్వం నుంచి ప్రజలు హోమియోపతి వైద్య విధానాన్ని అనుసరించేవారన్నారు.

50 సంవత్సరాల దేశ వైద్య చరిత్రలో హోమియోపతికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందన్నారు. అయితే, అల్లోపతి వైద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చాక హోమియోపతిపై ప్రజలకు ఆసక్తి తగ్గిందన్నారు. అయితే, అల్లోపతి వల్ల ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండటమే కాకుండా ఖర్చు ఎక్కువగా ఉంటుందని ఉంటుందన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ సనాతన వైద్య విధానం పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందకోసం తమిళనాడు ప్రభుత్వం మరింతగా కృషి చేస్తోందన్నారు. ఇందులోభాగంగా రాష్ట్రంలోని 300 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్ విభాగాలను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.

ఒక్కో విభాగానిక ఒక వైద్యుడు, ఒక నర్సును నియమిస్తున్నామని, నియామక పత్రాలు కూడా శుక్రవారం అందజేస్తామని తెలిపారు. హోమియోపతి విభాగం ఆధ్వర్యంలో స్వైన్ ఫ్లూ వ్యాధికి మందును పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. అంతేకాకుండా,
Srini
WD
చెన్నయ్, తిరునెల్వేలిలోని సిద్ధ వైద్య కళాశాలల్లో కొత్తగా రెండు కోర్సులను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.


ఈ కోర్సుల్లో చేరేందుకు ప్లస్ టూను విద్యార్హతగా నిర్ణయించినట్టు చెప్పారు. ఇది రెండేళ్ల కాలపరిమితి కలిగి వుంటుందన్నారు. ఇదిలావుండగా, హోమియోపతిపై ప్రజలల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తమ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం ఒక సదస్సును నిర్వహించనున్నట్టు చెప్పారు.

మద్రాసు విశ్వవిద్యాలయంలోని సెంటెనరీ హాలులో జరిగే ఈ సదస్సును రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఎంఆర్కే.పన్నీర్ సెల్వం ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సందస్సులో ఆయుష్ నిపుణులతో పాటు.. ప్రభుత్వ వైద్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారని ఐఏఎస్ అధికారి రాజ్‌కుమార్ వివరించారు.

వెబ్దునియా పై చదవండి