ఊబకాయాన్ని నివారించవచ్చు కానీ...

సోమవారం, 7 ఏప్రియల్ 2008 (20:57 IST)
ఊబకాయాన్ని నివారిస్తే మనుషుల ప్రాణాలు కాపాడవచ్చు కాని డబ్బును పొదుపు చేయలేరని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రజలు దీర్ఘకాలం జీవిస్తారు కాబట్టి ఆరోగ్యంపై వారు అధికంగా ఖర్చుచేయవలసి వస్తుందని డచ్‌లో జరిగిన ఓ అధ్యయనం తెలిపింది.

ఊబకాయాన్ని అరికడితే ప్రభుత్వాలకు కోట్లాది డాలర్ల మేరకు మిగులుతుందని వ్యాప్తిలో ఉన్న వార్త భ్రమ మాత్రమే అని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. బాగా కొవ్వు కలిగినవారితో, పొగరాయుళ్లతో పోల్చి చూస్తే పెద్దవయస్సులో సన్నగా, ఆరోగ్యంగా ఉంటున్న వారు ఆరోగ్యంపై చాలా ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుందని పై అధ్యయనం తేల్చింది.

ఒబేసిటీ అనే ఊబకాయంతో ప్రభుత్వానికి కోట్లాది డాలర్లు ఖర్చు అవుతుందనే భావనపై ఈ అధ్యయనం నీళ్లు చల్లుతోందని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీలో ఆరోగ్య రాజకీయాలు శాఖ ప్రొఫెసర్ పాట్రిక్ బాషామ్ పేర్కొన్నారు. ఊబకాయం ఖర్చుల గురించి ప్రభుత్వాలు వెలువరిస్తున్న ప్రకటనలు కేవలం అంచనాలపై, రాజకీయ అజెండాలపై, సైన్సులో మార్పులపై ఆధారపడి ఉంటున్నాయని హాప్కిన్స్ చెప్పారు.

మనం నిజంగా ఊబకాయం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నట్లయితే, మనం దాని ఆర్థిక ప్రభావం గురించి భీతిల్లడం ఆపుకోవాలని జాన్స్ స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి