రోజుకు అర్థ గంట వ్యాయామంతో పేగు కేన్సర్‌కు దూరం!!

ప్రతి రోజూ అర్థగంట పాటు వ్యాయామం చేస్తే పేగు కాన్సర్‌కు దూరంగా ఉండవచ్చని ఒక పరిశోధనలో తేలింది. దీనిపై అనేక రోజుల పాటు పరిశోధన జరిపిన ద్వారా జీవితాన్ని ఉత్సాహవంతంగా గడిపే వారికి ఈ జబ్బు నుంచి తప్పించుకొనే అవకాశం ఉందని డైలీ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.

శారీరక దారుఢ్యాన్ని కాపాడుకునే వారు 3 రెట్లు ఆ వ్యాధి బారిన పడకుండా అవకాశం ఉందని వాషింగ్టన్ యూనివర్శిటీ మెడిసిన్ విభాగ శాస్రవేత్తలు కనుగొన్నారు. చురుకైన నడకచేసే వారికి 16 శాతం ఈ వ్యాధి బారి నుంచి తప్పించుకోవచ్చని వారు కనుగొన్నారు. ఈ పరిశోధనలకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కేథలీన్ వాలీన్ వ్యాయామం చేయుటయే మంచి మార్గమని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి