హైహీల్స్‌తో మహిళల పాదాలకు దీర్ఘకాలిక సమస్యలు

బుధవారం, 5 జూన్ 2013 (12:58 IST)
File
FILE
నేటి సమాజంలో హైహీల్స్‌ వేయడం మహిళలకు ఓ ఫ్యాషన్‌గా మారింది. దీంతో ఎక్కువ మంది యువతులు, మహిళలు, వృద్ధులు కూడా వీటిని వాడుతున్నారు. అయితే, ఎత్తు మడమలు (హైహీల్స్) కలిగిన చెప్పులను వాడటం వల్ల మహిళల్లో దీర్ఘకాలిక సమస్యలు వస్తున్నట్టు తాజా పరిశోధనలో వెల్లడైంది.

ముఖ్యంగా ఈ తరహా చెప్పులను వేసుకున్న ఒక గంట వ్యవధిలోనే పాదాల నొప్పులు ఆరంభమవుతాయన్నారు. కాలికి సరిగా సరిపోని చెప్పులు వేసుకోవడం వల్ల ఆర్థరైటిస్, ఫ్రాక్చర్లు, నాడీసమస్యలు సహా అనేక దీర్ఘకాలిక సమస్యలు వస్తాయన్నారు. వాటిని నయం చేయాలంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్లు లేదా శస్త్రచికిత్సే మార్గమని పాదాల వైద్యనిపుణుడు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి