వాస్తవానికి నిద్రించేటప్పుడు మెదడు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకుంటుంది. ఈ క్రమంలో రాత్రంతా హెడ్‌ఫోన్స్‌ను అలాగే ఉంచి నిద్రిస్తే శరీర కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది. ప్రధానంగా విశ్రాంతి దశలో ఉండే మెదడుపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. నిద్రలేమి, అలసట వంటి ఇతర సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.