ఇరుగు పొరుగు వారితో కలిసుంటే.. గుండె పదిలం!

సోమవారం, 17 నవంబరు 2014 (18:59 IST)
ఫేస్ బుక్, ట్విట్టర్ ఫ్రెండ్స్‌తో పాటు ఊరంతా మిత్రులున్నా ప్రయోజనం లేదు. ఇరుగు పొరుగు వారితో ఎలా ప్రవర్తిస్తారనే దానిపైనే ఆరోగ్య ప్రభావం ఉంటుందని తాజా అధ్యయనాలు తేల్చాయి. 
 
ఇంట్లో ఏ వేడుక జరిగినా పక్కింటివాళ్లకు సంబంధమే లేనట్లు అటువైపు కన్నెత్తి చూడకుండా ఉన్నట్లైతే, ఇతరులు పలికినా మనస్ఫూర్తిగా పలకకుండా ఉన్నవారైతే హృద్రోగ సమస్యలను కొనితెచ్చుకున్నవారవుతారని పరిశోధనలో తేలింది.
 
ఇంటిచుట్టుపక్కలున్న వాళ్లతో ఎవరైతే సత్సంబంధాలు కలిగి ఉంటారో వాళ్లలో హృద్రోగాలు తక్కువని పరిశోధన తేలింది. సో.. హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవాలంటే ఇరుగు పొరుగు వారితో స్నేహభావంగా మెలగాలన్నమాట. 

వెబ్దునియా పై చదవండి