కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే భారత్‌లో లక్షకు పైగా కొత్త కేసులు వచ్చాయని గుర్తు చేసిన ఐసీఎంఆర్, రెమిడీసివిర్‌ను రోగులకు ఇవ్వడం వల్ల లివర్, కిడ్నీ వైఫల్యాలు తలెత్తవచ్చని పేర్కొంది.
ఎంతో ఎమర్జెన్సీ అయితేనే రెమిడీసివిర్, టోసిలిజుమాబ్ ఔషధాలను వినియోగించాలని, వీటిని అతిగా వాడటం వల్ల మంచి కన్నా చెడు జరిగే అవకాశాలు అధికమని హెచ్చరించింది.
కాగా, కరోనా నుంచి త్వరగా బయటపడేందుకు రెమిడీసివిర్ సహకరిస్తుందని తేలినప్పటికీ, ఈ డ్రగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మరణాల రేటు మాత్రం తగ్గకపోవడం గమనార్హం.