'కరోనా వైరస్‌'కు మరణం ఉందంటున్న వైద్యుడు

మంగళవారం, 10 మార్చి 2020 (18:04 IST)
ఇపుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ కరోనా. ఈ వైరస్‌ బారినపడితే ప్రాణాలు కోల్పోతారన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఎందుకంటే.. ఇప్పటికే ఈ వైరస్ బారినపడి రోగుల్లో 4012 మంది మృతి చెందారు. మరో నాలుగు వేల మంది వరకు ఈ వైరస్ బారినపడివున్నారు. అలా ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్ ఇపుడు ఏకంగా 113 దేశాలకు వ్యాపించింది. 
 
అలాంటి వైరస్ కూడా మరణం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఎలాంటి వ్యాధికారక సూక్ష్మజీవులైన కాలపరిమితి ఉంటుందని అంటున్నారు. తరచూ రూపం మార్చుకునే తత్వం కారణంగా ఈ వైరస్‌ క్రమేపీ అంతరించిపోతుంది. ఇది కరోనాకూ వర్తిస్తుందన్నది వారి అభిప్రాయంగా ఉంది. 
 
అలాగే ఎలాంటి వైర్‌సల నుంచి అయినా మానవ శరీరం కాలక్రమేణా రక్షణ పెంచుకుంటూ ఉంటుంది. దీన్నే హెర్డ్‌ ఇమ్యూనిటీ అంటారు. దీనికి సహజంగా ఆరు నెలల సమయం పట్టవచ్చు. వేడి వాతావరణం కలిగిన తెలుగు రాష్ట్రాల్లో అంతకంటే తక్కువ సమయమే పట్టవచ్చు. ఫలితంగా ఈలోగా వైరస్‌ సోకినా పెద్దగా ప్రమాదం ఉండదు. ఇలా రెండు రకాలుగా ఈ వైరస్‌ నుంచి సురక్షితంగా బయటపడవచ్చు.
 
అంతేకాకుండా, ఈ వైరస్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని వారు అంటున్నారు. గతంలో స్వైన్‌ ఫ్లూ, సార్స్‌ (ఎస్‌.ఎఆర్‌.ఎస్‌), మార్స్‌ (ఎమ్‌.ఎ.ఆర్‌.ఎస్‌) వైరస్‌ల కంటే కరోనా పట్ల విపరీతమైన ప్రచారం కారణంగానే భయాందోళనలు పెరిగాయని గుర్తుచేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు