దీంతో ఈ యేడాది కేరళ రాష్ట్రంలో నమోదైన తొలి నిఫా కేసుగా గుర్తించారు. అయితే, ఈ విద్యార్థికి నిఫా వైరస్ సోకిందన్న అంశంపై వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. ఇందుకోసం ఆరుగురు వైద్యుల బృందాన్ని కేరళ ప్రభుత్వం నియమించింది. ఈ బృందం జరిపిన పరిశోధన, వైద్య పరీక్షల్లో ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది.
ఈ వైరస్ సోకిన విద్యార్థి రెండు వారాల క్రితం బాగా మగ్గి, కుళ్లిపోయిన జామకాయలు ఆరగించినట్టు తేలింది. ఈ కాయలను ఆరగించడం వల్లే ఈ సమస్య వచ్చినట్టు తేలింది. నిజానికి జామకాయలు తింటే నిఫా వైరస్ సోకదనీ కానీ, అతని ఆరగించిన కుళ్ళిపోయిన జామకాయను గబ్బిలం కొరికివుండొచ్చని అందుకే అతనికి నిఫా వైరస్ సోకివుంటుందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ విద్యార్థి రక్తం శాంపిల్స్ తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు.