పురుషుల్లో ఈ సమస్యకు కారణాలేమిటి?
పొగత్రాగడం, అధికబరువు... ఈ రెండూ ప్రధాన కారణాలుగా గుర్తించారు. అంతేకాకుండా రసాయనాలు, పురుగు మందులు, ప్లాస్టిక్ పదార్థాల వాడకం, స్థూలకాయం, ఒత్తిడి, ఆహార పదార్థాల్లో మార్పు, అధికంగా టీవీ లేదా కంప్యూటర్ చూడటం వంటివన్నీ పురుషుల్లో శుక్ర కణాల స్థాయిని హరించి వేస్తున్నాయని కనుగొన్నారు.
అందువల్లనే ఇటీవలి కాలంలో ఐటీ సంబంధిత వృత్తుల్లో కొనసాగేవారు వారి జీవనశైలిని మార్చుకోని కారణంగా వివాహమైన తర్వాత సంతానలేమితో బాధపడుతుండటాన్ని మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇలాంటి సమస్యలన్నిటినీ మానవుడు అధిగమించి పయనించినప్పుడు అతడి మనుగడ సాధ్యమనీ, లేదంటే మానవ జాతి కనుమరుగయ్యే దారుణ స్థితి దాపురించినా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ పరిశోధకులు తెలిపారు.