ఒకే ఒక్క రక్తపు చుక్క.. తదుపరి 14 సంవత్సరాల్లో అకాల మరణాన్ని గుర్తిస్తుందా?

శుక్రవారం, 23 అక్టోబరు 2015 (17:11 IST)
అవును. ఒకే ఒక్క రక్తపు చుక్క చాలు.. తదుపరి 14 సంవత్సరాల్లో అకాల మరణం సంభవిస్తుందా? లేదా అనే విషయాన్ని గుర్తిస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. అకాల మరణానికి గురిచేసే వ్యాధుల సంగతి కూడా ఈ బ్లడ్ టెస్టులో తేలిపోతుందని మెల్ బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు.  పదివేల మందిపై జరిపిన అధ్యయనంలో అకాల మరణాన్ని గురించి సులువుగా తెలిపే ఈ సరికొత్త విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. 
 
ఈ పరిశోధన ఎలా జరిగిందంటే.. పదివేల మందిని భాగస్వామ్యం చేసిన అధ్యయనకారులు వారికి మాలిక్యులర్ బై ప్రొడక్ట్ పరిసోధనలు చేశారు. రక్తంలోని గ్లిక్-ఏ పరిణామాన్ని గుర్తించారు. ఈ పరిశోధనలో గ్లిక్-ఏ పరిమాణం ఎంత ఎక్కువగా వుంటే వారిలో అంత అకాల మరణానికి అవకాశాలు ఉన్నట్టేనని మెల్ బోర్న్ వర్శిటీ శాస్త్రవేత్త మైకేల్ ఇనోయ్ తెలిపారు. ఈ గ్లిక్-ఏ పరిమాణం తక్కువగా ఉంటే అకాల మరణం సంభవించే రోగాలు శరీరంలో తక్కువగా ఉన్నట్టు గుర్తించామని ఆయన చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి