గొంతునొప్పి నివారిణి "మిరియాల రసం"

శనివారం, 25 అక్టోబరు 2008 (14:58 IST)
FileFILE
దగ్గు, జలుబు, గొంతు నొప్పుల నుంచి సత్వర ఉపశమనం లభించాలంటే... మిరియాల రసాన్ని తయారు చేసుకుని వాడాల్సిందే మరి. దీనికోసం ఒక గ్లాసు మంచినీరు, ఐదారు మిరియాల గింజలు, ఒక వెల్లుల్లి పాయ రెమ్మ, చితక్కొట్టిన అల్లం ముక్క చిన్నది, ఓ చిన్న బెల్లం ముక్కలను కలిపి స్టవ్‌పై బాగా ఉడికించాలి.

గ్లాసు నీరు అరగ్లాసు అయ్యేదాకా మరిగించి దించేసి వడగట్టుకుని, వేడి వేడిగా తాగాలి. ఈ రసాన్ని తాగడం వల్ల దగ్గు, జలుబు, గొంతునొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మంచి ఘాటు వాసనను కలిగి ఉండే మిరియాలతో చాలా ఉపయోగాలున్నాయి కూడా. వీటిని మసాజ్ ఆయిల్ తయారీలో కూడా వాడతారు.

మిరియాలతో తయారైన మసాజ్ ఆయిల్‌తో మర్ధనా చేసుకోవడం లేదా కొన్ని చుక్కలను నీటిలో కలుపుకుని స్నానం చేయడం లాంటివి చేస్తే... కండరాల నొప్పులు, మామూలు ఒళ్లునొప్పులు తగ్గటమే గాకుండా, గాయాలనుండి రసి కారడాన్ని కూడా చాలా బాగా తగ్గించివేస్తుంది.

వెబ్దునియా పై చదవండి