దోమల బాధ ఎక్కువగా ఉందా.. అయితే ఇవి పాటించండి!!

File
FILE
చాలా గృహాల్లో దోమల బాధ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో ఈ దోమలు మరీ ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు కొన్ని చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు.

ముఖ్యంగా ఇంట్లో విపరీతంగా దోమలు ఉన్నట్టయితే టీ పొడిని ఒక పాత్రలో వేసి కాల్చితే ఆ ఘాటుకు దోమలు దూరమవుతాయి. అలాగే, పుదీనా మొక్కను ఓ కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే ఆ ఘాటుకు దోమలు పారిపోతాయి.

ఒక గ్లాసు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని కర్పూరం బిళ్ళలు వేస్తే వచ్చే వాసన కూడా దోమలు ఇంటి నుంచి పోతాయి. అదేవిధంగా దోమ కుడితే నొప్పి, దురదగా ఉన్న చోట వెనిగర్‌ అద్దిన దూదితో మృదువుగా రుద్దితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

వెబ్దునియా పై చదవండి