ధనియాల పొడిలో ఉప్పు కలుపుకుని రోజూ ఓ చెంచాడు తీసుకొంటే...?

గురువారం, 3 ఆగస్టు 2017 (18:48 IST)
ధనియాలు... మాంసాహార కూరలు వండేటప్పుడు, ఈ ధనియాలను ఎక్కువగా ఉపయోగిస్తాము. కూర రుచిగాను, సువాసనగా ఉంటుంది. ఈ ధనియాలు వలన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్నాయి. అవేంటో చూద్దాం...
 
* బియ్యం కడిగిన నీటిని కలిపి ధనియాలు మెత్తగా నూరి, ముద్ద చేసి దానికి పటికబెల్లం చేర్చి కొద్ది మోతాదుల్లో తింటే  పిల్లలకు తరచూ వచ్చే దగ్గు, ఆయాసం తగ్గే అవకాశం ఉంది. 
 
* అజీర్తి, పుల్లత్రేపులు, కడుపు ఉబ్బరం గలవారికి ధనియాలు శుభ్రం చేసి తగు ఉప్పు కలిపి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి రోజూ ఆ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే మంచిది.
 
* షుగర్, బీపీలను కంట్రోల్‌లో ఉంచుతాయి. గర్భవతులు రోజూ తమ ఆహారంలో విధిగా ధనియాలు తీసుకోవడంవల్ల ముఖ్యంగా ప్రసవించిన సమయంలో గర్భకోశానికి ఎంతో మేలు కలుగుతుంది.
 
* నిద్రలేమితో బాధపడే వారు ధనియాల కషాయం చేసుకొని… ఆ కషాయంలో కొద్దిగా పాలు కలుపుకొని తాగిత నిద్ర బాగా పడుతుంది. వర్షాకాలంలో ఎక్కువగా అజీర్ణ సమస్య ఉంటుంది. ఇలా అజీర్తిని ధనియాలతో తగ్గించుకోవచ్చు. 
 
* ధనియాల పొడిలో ఉప్పు కలుపుకుని రోజూ ఓ చెంచాడు తీసుకొంటే అజీర్తి బాధ తగ్గి ఆకలి బాగా అవుతుంది.
 
* ధనియాలు రోజూ తీసుకోవడం వల్ల చిన్న పిల్లలతో పాటు.. స్త్రీలకు ఎక్కువగా మేలు చేస్తుంది. మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, గడబిడ, మలబద్ధకం వున్నవారు ధనియాల పొడిని మజ్జిగలో కలుపుకొని త్రాగితే తగ్గిపోతుంది.

వెబ్దునియా పై చదవండి