సోయాబీన్ పాలతో షుగర్ వ్యాధికి చెక్...

శుక్రవారం, 20 జులై 2018 (10:41 IST)
పాలల్లో పోషకాలున్నాయని తెలిసినా కొందరు పాల సంబంధిత పదార్థాలను ఇష్టపడరు. కారణం ఏదయినా సరే ఇప్పుడు పాలకు కొన్ని ప్రత్యామ్నాయాలు ఎంచుకోవచ్చు. అవేంటో చూసేద్దాం. 
 
ఎండిన సోయాబీన్స్‌ని నీళ్లల్లో నానబెట్టి పాలు తీస్తారు. లాక్టోజ్‌ పడనివాళ్లు దీన్ని ప్రయత్నించవచ్చు. ఈ పాలను తాగడం వల్ల రక్తనాళాలు బలపడతాయి. మెనోపాజ్‌ సమయంలో సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి. దీంట్లో శాచురేటెడ్‌ ఫ్యాట్‌, చక్కెరశాతం చాలా తక్కువగా ఉంటుంది. మాంసకృత్తులు అందుతాయి. 
 
దంపుడు బియ్యంతో చేసే ఈ పాలల్లో పోషకాలు ఎక్కువ. కాస్త తియ్యగానే కాదు రకరకాల రుచుల్లోనూ దొరుకుతున్నాయి. వీటివలన ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. బాదంపప్పుని నానబెట్టి పాలు తీయడం కూడా చాలా సులువు. వీటినుంచి తగినన్ని మాంసకృత్తులు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్‌ ఇ, ఇనుము, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్ల వంటివెన్నో అందుతాయి. శరీరంలో వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు