ఆస్తమాను అడ్డుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

బుధవారం, 22 డిశెంబరు 2021 (21:55 IST)
ఆస్తమా సమస్య వున్నవారు ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యకరమైన బరువు వుండేట్లు చూసుకోవాలి. ఎందుకంటే అధిక బరువు ఆస్తమాను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే పండ్లు, కూరగాయలు పుష్కలంగా తినాలి.
అలెర్జీని ప్రేరేపించే ఆహారాలు ఏమిటో తెలుసుకుని వాటికి దూరంగా వుండాలి. విటమిన్ డి తీసుకోవాలి.

 
కొన్ని మూలికా టీలు ఆస్తమా నుండి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. అల్లం టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ తాగితే శ్వాసకోశ కండరాలను సడలించవచ్చని, శ్వాసను ఇతర ప్రయోజనాలతో పాటుగా పెంచవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి.
 
 
అలాగే పసుపు పాలు ఆర్థరైటిస్, క్యాన్సర్‌తో కూడా పోరాడుతాయి. ఆస్తమాకు సంబంధించి ఈ పాలను తాగితే ఉపశమనం కలుగుతుందని ఒక అధ్యయనంలో పరిశోధకులు కనుగొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు