పండు తిని తొక్క ప‌డేయ‌కండి..!

గురువారం, 26 మే 2016 (21:17 IST)
అరటిపండుతో ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలున్నాయి. కానీ పండు తిని తొక్కపడేస్తుంటాము. కానీ అరటిపండు తొక్కలో పొటాషియం, క్యాల్షియం, విటమిన్ ఇ అధిక మోతాదులో ఉంటాయి.
 
*అలర్జీ, చర్మ సంబంధిత సమస్యల నుంచీ అరటి తొక్కలు ఉపశమనం కలిగిస్తాయి.రాత్రి పడుకునే ముందు సమస్య ఉన్న చోట రాస్తే ఫలితం ఉంటుంది. ఏదైనా గాయం తగిలినప్పుడు యాంటీసెప్టిక్ క్రీం అందుబాటులో లేకపోతే అరటి పండు తొక్కతో గాయం చుట్టు పక్కల రాయండి. ఇది గాయం మానడానికి ఉపకరిస్తుంది. అరటి తొక్క లోపలి భాగాన్ని పళ్లపై రుద్దితే అవి తెల్లగా మారతాయి. తొక్కలోని మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం పళ్లపై ఉండే ఎనామిల్ పొరని తెల్లగా చేస్తాయి.
 
* అరటి తొక్క సొరియాసిస్‌ని తగ్గించడంలో ఎంతో సాయపడుతుంది. సొరియాసిస్ సోకిన చోట అరటిపండు తొక్కతో రుద్దితే ఫలితం ఉంటుంది. రుద్దేప్పుడు చర్మం ఎర్రగా మారుతుంది. కానీ తరవాత చక్కటి ఫలితం ఉంటుంది. మొటిమలకూ ఇది చక్కటి పరిష్కారం. మొటిమలున్న చోట అరటి తొక్కతో కొన్ని నిమిషాలు రాసి, తరవాత కడిగేయాలి. రాత్రి పడుకునే ముందు తొక్కతో రుద్దినా సరిపోతుంది. దద్దుర్ల నుంచీ ఇది ఉపశమనాన్ని అందిస్తుంది.

వెబ్దునియా పై చదవండి