మళ్లీ ఆ స్థాయిలు తగ్గాలంటే అందుకు లివర్, మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను తినకపోవడమే మంచిది. లేదంటే చక్కెర స్థాయిలు పెరిగి తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు సూచిస్తున్నారు.
అలాగే అధిక బరువు ఉన్న వారు, స్థూలకాయులు అరటి పండ్లను తినకూడదు. తింటే అందులో ఉండే కార్బొహైడ్రేట్లు వారిలో అధికంగా కొవ్వును ఉత్పత్తి చేస్తాయి. దీంతో ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారు. కనుక అధిక బరువు ఉన్నవారు అరటి పండ్లను తినరాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా అలర్జీ సమస్య ఉన్నవారు అరటిపండ్లను తినరాదు. తింటే ముఖం, ఇతర శరీర భాగాలు ఉబ్బినట్టు కనిపిస్తాయి. దురద కూడా ఉంటుంది. కనుక అలాంటి వారు అరటిపండ్లను మానేయాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.