1. అరటిపండ్లలో పుష్కలంగా లభించే బి6, సి విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటి నుండి లభించే పీచు పదార్థాల వల్ల మలబద్ధకం నుండి విముక్తి లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగై విరేచనం సాఫీగా జరగడంలో సహాయపడుతుంది.
3. టోక్యో యూనివర్సిటీ వారి పరిశోధనల ప్రకారం అరటిపండ్లలో ఉండే ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్లు (టీఎన్ఎఫ్) క్యాన్సర్ కణాలతో సమర్ధంగా పోరాడి వాటిని నిర్మూలిస్తాయని తేలింది. అరటిపండు ఎంత పండితే ఈ క్యాన్సర్ నిరోధక గుణాలు అంతగా పెరుగుతాయట. అందులోనూ ఆకుపచ్చ అరటిపండ్ల కన్నా పసుపుపచ్చ రకం పండ్లలో పోషకాలు ఎనిమిది రెట్లు అధికంగా ఉంటాయట.