ఉల్లికాడల్లోని ఎ, సి విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను శక్తిమంతం చేస్తాయి. ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి. వీటిలో ఫైబర్, ఎ, బి,సి విటమిన్లు, ఫోలేట్‌తో పాటు పొటాషియం, ఐరన్, మెగ్నీషియం వంటి లవణాలు అధికంగా ఉంటాయి.
వీటిలో కావల్సినంత ఫైబర్ లభిస్తుంది. మధుమేహంతో బాధపడేవారికి ఉల్లికాడలు మంచి డైట్.
అల్లిసిన్ అనే రసాయనం చర్మ ముడతలు పడకుండా చూస్తుంది.
ఉల్లికాడల్లోని కె,సి విటమిన్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు ఈ కాలంలో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గును నివారిస్తాయి.