బ్లడ్ ప్లేట్‌లెట్ లెవల్స్‌ను పెంచుకోవాలంటే ఏం చేయాలి?

శుక్రవారం, 29 జులై 2016 (15:23 IST)
శరీరంలో ప్లేట్‌లెట్ లెవల్స్‌ను పెంచుకోవాలంటే ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్, పండ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో 30శాతం వరకు ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్, పండ్లు తినడం వల్ల ప్లేట్‌లెట్ లెవల్స్‌ను సహజంగా పెంచుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం....
 
దానిమ్మ పండులో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది ప్లేట్ లెట్ లెవల్స్‌ను పెంచడానికి తోడ్పడుతుంది.
ఆకుకూరల్లో ఉండే విటమిన్ ప్లేట్‌లెట్ లెవల్స్‌ను విపరీతంగా పెంచుతుంది. 
ప్రతిరోజు గుప్పెడు ఎండు ద్రాక్షను తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్ లెవల్స్‌ను సహజంగా పెంచుతుంది. 
రోజువారీ డైట్‌లో ఆప్రికాట్‌ను తీసుకోవడం వల్ల ప్లేట్‌లెట్ లెవల్స్‌ను పెంచుకోవచ్చు. 
ఎండుఖర్జూరంలో కూడా ఐరన్, న్యూట్రీషియన్స్ అధికంగా ఉండడం వల్ల సహజంగా ప్లేట్‌లెట్ లెవల్స్‌ను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

వెబ్దునియా పై చదవండి