* పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళేముందు కనీసం అరగంటకు ముందుగానే కాఫీలు , టీలు, సిగరెట్లు తీసుకోకూడదు. ఇవన్నీ తాత్కాలికంగా బీపీని పెంచుతాయి.
* శారీరకంగాగాని, మానసికంగాగాని ఎలాంటి ఆందోళన, ఒత్తిడి ఉన్నా కూడా ఆ సమయంలో బీపీ పెరుగుతుంది. కాబట్టి మనసులో ఎలాంటి ఆలోచనలూ ఆందోళనలూ పెట్టుకోకూడదు. ఆ సమయంలో మూత్రవిసర్జనను ఆపుకోవడంలాంటి చిన్నచిన్న వత్తిళ్లకు కూడా దూరంగా వుండాలి.