కోడిగుడ్లను ఉడకబెట్టి తింటే మేలెంత?

శనివారం, 2 డిశెంబరు 2017 (09:49 IST)
కోడిగుడ్ల ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. కోడిగుడ్లలో వుండే పొటాషియం, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి6, విటమిన్ బి 12, మెగ్నిషియం,  శాచురేటెడ్ ఫ్యాట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్లు వుంటాయి. ఇవి శరీరానికి అందడం ద్వారా పలు అనారోగ్య సమస్యలు తలెత్తవు. రోజుకో కోడిగుడ్డును తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగినట్లేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
కోడిగుడ్లను ఉడకబెట్టి తింటే ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. అయితే ఉడికించిన కోడిగుడ్లను అప్పుడే తినేయడం మంచిది. గంటల పాటు బాక్సుల్లో వుంచి తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే.. ఉడికిన గుడ్డుపై బాక్టీరియా, వైరస్‌లు త్వరగా చేరి అవి కంటామినేట్ అవుతాయి. కనుక ఉడికిన గుడ్డును 3 గంటల్లోపే తినేయడం మంచిది. పొట్టు తీసిన బాయిల్డ్ ఎగ్స్‌ను ఒక్క రోజు కంటే ఎక్కువ ఫ్రిజ్‌లో నిల్వ వుంచకూడదు. 
 
ఒక కోడిగుడ్డును ఉకడబెట్టుకుని పచ్చ సొనతోపాటుగా తింటే రోజుకు ఒక గుడ్డు చాలు. ఒబిసిటీ వున్నవారు తెల్లసొన మాత్రమే తినాలి. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. ఇక మధుమేహం ఉన్నవారు వారానికి రెండు గుడ్లను తినవచ్చు. అది కూడా పచ్చ సొనతో కలిపి తినకుండా ఉంటే బెటరని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు