ఉదయం పూట కేకులు తినొద్దు.. నూడుల్స్ వద్దే వద్దు..

సోమవారం, 31 జులై 2017 (10:20 IST)
అల్పాహారంపై చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. నోటికి ఏవి దొరికితే అవి తిని సరిపెట్టుకునే వారు చాలామంది వున్నారు. అయితే అల్పాహారంగా ఏవి పడితే అవి తినకూడదు. ఉదయం పూట కేకులు తినడం సరికాదు. ఇందులో పంచదార, వెన్న ఎక్కువగా ఉంటుంది. అందుచేత వీటిని ఉదయం తినడం ద్వారా శరీరంలో ఎక్కువ కెలోరీలు చేరిపోతాయి. ఇంకా బంగాళాదుంపలను అల్పాహారంలో తీసుకుంటే పొట్టలో ఇబ్బందితో అసౌకర్యానికి గురవుతారు. 
 
ప్రయాణ సమయాల్లో ఫ్రెంచ్ ఫ్రైస్, బంగాళాదుంపతో చేసిన స్నాక్స్‌కి దూరంగా ఉండటం మంచిది. కొందరు పండ్ల రసాలను ఫ్రిజ్‌లో వుంచుతారు. వాటిని తాగడం ద్వారా కడుపులో బ్యాక్టీరియా చేరుతుంది. ఇక అల్పాహారంలో నూడుల్స్ తీసుకోవద్దు. వాటిలో సోడియం అధికం. అలాగే రాత్రిపూట మిగిలిన చికెన్ వంటకాలను ఫ్రిజ్‌లో వుంచి మర్నాడు వేడి చేసి తింటారు. ఇలా చేస్తే హాని చేసే ట్రాన్స్‌ఫ్యాట్లు శరీరంలోకి చేరిపోతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి