ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారా? బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే బెండకాయలు తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బెండకాయలో లో-కెలోరీలు, పీచు ఎక్కువగా ఉండటం ద్వారా బరువు తగ్గడం సులభమవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు బెండకాయలను తీసుకోవడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది.
అలాగే వెల్లుల్లి రెబ్బలు బరువును తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. ఇందులో హృద్రోగ సమస్యలను దూరం చేసే ధాతువులు అధికంగా ఉంటాయి. వ్యాధినిరోధక శక్తి కొలెస్ట్రాల్‌ను ఈజీగా తగ్గించవచ్చు. పాలకూరను డైట్‌లో చేర్చుకోవడం ద్వారాను బరువు తగ్గొచ్చు. అందుకే వారంలో రెండు సార్లు పాలకూరను ఆహారంలో చేర్చుకోవాలి. పచ్చిమిర్చి, ఎండు మిర్చి అధికంగా కాకుండా మితంగా ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.