హెయిర్ డామేజ్‌కు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి?

మంగళవారం, 22 జులై 2014 (16:49 IST)
ఫ్యాషన్ పేరిట కొబ్బరి నూనె అంటేనే అసహ్యించుకుంటున్నారా? అయితే తప్పక ఈ స్టోరీ చదవండి. కొబ్బరి నూనె దివ్యౌషధం అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కేశాలను సంరక్షించడంతో కొబ్బరినూనెకు సాటిలేదు. రాత్రిపూట నిద్రకు ఉపక్రమించేందుకు ముందు కొబ్బరి నూనెను తేలిగ్గా వేడి చేసి మాడుకు, జుట్టుకు పట్టించి నిద్రపోవాలి. 
 
తెల్లవారుజామున తలస్నానం చేయడం ద్వారా జుట్టు మృదువుగా తయారవుతాయి. వారానికి ఒకసారి లేదా రెండు సార్లు ఇలా చేయడం ద్వారా హెయిర్ డామేజ్‌కు చెక్ పెట్టవచ్చు. చుండ్రు కూడా దూరమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి