కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. ఆరోగ్యకరమైన కొవ్వుల స్థాయిలు పెరిగేందుకు తోడ్పడుతాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. మొటిమలు, పొడి చర్మం, నల్లటి మచ్చల నివారణకు కొత్తిమీరతో తయారైన ఔషధాలు ఉపకరిస్తాయి. కొత్తిమీర శరీరంలో ఇన్సులిన్ తయారీని పెంచుతుంది. తద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు.
కొత్తిమీరలోని ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల తలనొప్పి, మానసిక అలసట, ఒత్తిడి తగ్గిపోతుంది. కొత్తిమీరలోని జింక్, కాపర్, పొటాషియం పుష్కలంగా వుంటుంది. జీర్ణకోశ వ్యాధుల నివారణకు కొత్తిమీర ఎంతగానో ఉపకరిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.