బత్తాయి రసంలో అల్లం, జీలకర్ర పొడి వేసుకుని తాగితే?

మంగళవారం, 12 మే 2020 (22:30 IST)
బత్తాయి పండులో పోషకాలతో పాటు ఔషధ గుణాలూ ఎక్కువే. ముఖ్యంగా జీర్ణ సమస్యల నివారణకి ఇది ఎంతో మేలు చేస్తుంది. బత్తాయిలోని ఆమ్లాలు శరీరంలో పేరుకున్న టాక్సిన్లను బయటకు పంపేందుకు దోహదపడతాయి.
 
1. బత్తాయిరసంలో అల్లం, జీలకర్ర పొడి వేసుకుని తాగితే ఆస్తమా కారణంగా దగ్గుతో బాధపడేవాళ్లకీ ఉపశమనంగా ఉంటుంది. ఇందులోని విటమిన్లు జుట్టు పెరుగుదలకు చర్మ సౌందర్యానికి దోహదపడతాయి.
 
2. మలబద్దకంతో బాధపడేవారికి బత్తాయిరసంలో చిటికెడు ఉప్పు వేసి ఇస్తే ఫలితం ఉంటుంది. ఇందులోని పొటాషియం మూత్రపిండాలు, మూత్రాశయంలో వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గడానికి దోహదపడుతుంది.
 
3. తరచూ ప్లూ, వైరస్‌లతో బాధపడేవాళ్లకి ఈ రసం బాగా పని చేస్తుంది. వీటిలో సమృద్ధిగా ఉండే ప్లేవనాయిడ్లు అల్సర్లని నివారిస్తాయి. ఆస్టియో ఆర్ధ్రయిటీస్, రుమటాయిడ్ ఆర్ద్రయిటీస్‌తో బాధపడేవాళ్లకి ఈ పండ్ల రసం తాగితే నొప్పులూ, పుండ్లు తగ్గుముఖం పడతాయి.
 
4. డయేరియా వల్ల కలిగే అలసటకీ, నీరసానికి బత్తాయిరసం అద్భుతమైన మందుగా పని చేస్తుంది.
 
5. గర్భిణుల్లో శిశువు పెరుగుదలకు బత్తాయిరసంలో పోషకాలన్నీ దోహదపడతాయి. ఇది రక్తవృద్ధికి, వీర్యవృద్ధికి కూడా తోడ్పడుతుంది. నరాల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు