పిల్లలకు రోజుకో కోడిగుడ్డు తినిపించండి.. వారి ఆరోగ్యానికి మేలు చేకూర్చండి..

సోమవారం, 12 జూన్ 2017 (09:22 IST)
పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజుకో కోడిగుడ్డు తినిపించాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకో కోడిగుడ్డు తీసుకునే పిల్లలు వేగంగా ఎదుగుతారని.. ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చాయి. గుడ్డులోని పోషకపదార్థాలు పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయని న్యూట్రీషన్లు సలహా ఇస్తున్నారు. పిల్లల శారీరక ఎదుగుదలను పెంపొందించడానికి ఇది తోడ్పడుతుందని వారు చెప్తున్నారు. 
 
ఈ మేరకు ఆరు నుంచి తొమ్మిది నెలలున్న పసికందులకు రోజుకో గుడ్డు తప్పక ఇవ్వాలట. ఇందులో గుడ్డు తినని వారితో పోలిస్తే ఈ చిన్నారుల ఎదుగుదల అన్ని రకాలుగా మెరుగ్గా ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇందులోని కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీనులు, విటమిన్‌ ఏ, బీ, డీ, ఈ, కాల్షియం, ఫాస్ఫరస్‌, జింక్‌, తదితర పలు రకాల పోషక పదార్థాలు పిల్లలకే కాదు అన్ని వయస్కుల వారి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుడ్డులోని విటమిన్‌ ఏ కంటి చూపు మెరుగుపర్చడానికి, విటమిన్‌ డీ ఎముకల ధృదత్వానికి, విటమిన్‌ ఈ కాన్సర్‌ నుండి కాపాడడంతోపాటు గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి