వెల్లుల్లిని నలగ్గొట్టి అలా తీసుకుంటే...

మంగళవారం, 23 జులై 2019 (22:27 IST)
వెల్లుల్లి వలన ఆరోగ్యపరమైన ఉపయోగాలు చాలా ఉన్నాయని ఇటీవల జరిగిన అధ్యయనాలు వెల్లడించాయి. చిన్న చిన్న రుగ్మతలైన దగ్గు, జలుబు, కడుపు ఉబ్బరం, గొంతు నొప్పి వంటి వాటిల్లో ఇది ఔషదంలా పని చేస్తుంది. గుండె సంబందిత వ్యాధుల నుండి కాపాడుతుంది. దీనివలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. వెల్లుల్లిలోని ఎల్లిసిన్ అనే పదార్దం వల్ల దీనికి ఇన్ని ఔషద గుణాలు సమకూరాయి. అదితే ఈ పదార్దానికి ఘాటైన వాసన ఉంటుంది. వెల్లుల్లిని తినేటప్పుడు ఈ ఎల్లిసిన్ నష్టం చెందకుండా ఉండాలంటే దానిని తాజాగా తరిగి కానీ, నలగ్గొట్టి కానీ, వేడి చేసి కానీ ఉపయోగించాలి. వేడి అన్నంలో పెట్టుకుని నమిలి మింగవచ్చు.
 
2. ముఖ్యంగా వెల్లుల్లి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. రక్తంలోని ప్లేట్లేట్లను పోగుపడనీయకుండా నిరోధిస్తుంది. రక్తనాళాలలోని రక్తం ఆటంకం లేకుండా ప్రవహించడానికి తోడ్పడుతుంది.
 
3. మనిషి శరీరానికి ఉపయోగపడే హెచ్‌డిఎల్ కొలస్ట్రాల్‌ను పెంచడమే కాకుండా, శరీరానికి హాని కలిగించే ఎల్‌డిఎల్ కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దీనివలన రక్తనాళాలు తేటగా ఉండటమే కాకుండా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయి.
 
4. రక్తపోటుని గణనీయంగా తగ్గించడం ద్వారా గుండెపోటు నుండి గుండెను రక్షిస్తుంది. అలాగే దీనిని అనునిత్యం వాడడం వలన పక్షవాతం మొదలైన రక్తప్రసరణ సంబంధ సమస్యలు ఉత్పన్నం కావు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు