ఆయుర్వేదంలో తిప్పతీగకు ప్రత్యేకమైన స్థానం వుంది. దీని ప్రయోజనాలు ఆమోఘమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అవేమిటో తెలుసుకుందాము. మహిళల్లో వృద్ధాప్య ఛాయలు రాకుండా, ముఖంపై మచ్చలు, మొటిమలు, ముడతలు ఏర్పడకుండా చేయగల ప్రత్యేక గుణాలు తిప్పతీగలో ఉన్నాయి. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇవి ఫ్రీరాడికల్స్‌తో పోరాడగలవు. శరరీంలోని కణాలు దెబ్బతినకుండా ఉండేందుకు వ్యాధుల బారినపడకుండా ఉండేందుకు తిప్పతీగ బాగా పని చేస్తుంది.
అజీర్తి సమస్యతో బాధపడుతున్నవారు తిప్పతీగతో తయారుచేసిన మందుల్ని వాడితే మంచిది.
తిప్పతీగ పొడిని బెల్లంలో కలుపుకుని తింటే అజీర్తి సమస్య పోతుంది. తిప్పతీగలో మధుమేహాన్ని నివారించే గుణాలున్నాయి, టైప్ 2 మధుమేహం తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు, టాన్సిల్స్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించగల గుణాలు తిప్పతీగలో ఉన్నాయి.