ఈ మూడింటిని జతచేస్తే.. కలిగే ప్రయోజనాలివే..?

శుక్రవారం, 7 డిశెంబరు 2018 (10:40 IST)
నిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ వంటి ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ గ్లాస్ నిమ్మరసాన్ని తీసుకుంటే శరీరంలోని చెడు పదార్థాలు తొలగిపోతాయి. మరి తేనె, మిరియాల పొడి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
 
1. నిమ్మకాయ రసంలో తేనె కలుపుకుని తీసుకుంటే కడుపు ఉబ్బరం, గొంతునొప్పి తగ్గుతుంది. వేడి నీటిలో తేనె, నిమ్మరసం పది చుక్కలు వేసుకుని తాగితే ఆయాసం తగ్గుతుంది. తేనె, తులసి ఆకురసం తీసుకుంటే.. దగ్గు, శ్లేష్మం తగ్గుతుంది.
 
2. కంటికి అవసరమైన విటమిన్ ఎ ను శరీరం తీసుకునేందుకు సహాయపడుతుంది. ఇది శరీరపు శక్తిని ఇనుమడింపజేస్తుంది. మానసిక ప్రశాంతతను, సహజమైన నిద్రను ఇస్తుంది. తేనె నీళ్లు పుక్కిలిస్తే నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు తగ్గుతాయి. 
 
3. తేనెలో కొంచెం మిరియాలపొడి కలుపుకుని తీసుకుంటే జలుబు తగ్గుతుంది. రెండు చెంచాల తేనెలో కోడిగుడ్డులోని తెల్లని సొన, కొంచెం శెనగపిండి కలుపుకుని ముఖానికి మర్దన చేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. 
 
4. రోజూ పావు గ్లాస్ గోరు వెచ్చటి నీళ్లలో రెండు చెంచాల తేనె కలుపుకుని తాగితే అధిక బరువు తగ్గుతారు. రాత్రిళ్లు తేనె కలుపుకున్న పాలు తాగితే చక్కటి నిద్ర వస్తుంది.
 
5. గ్లాస్ పాలలో స్పూన్ మిరియాల పొడి కొద్దిగా చక్కెర లేదా తేనె కలిపి తీసుకుంటే.. తలనొప్పి, గొంతునొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు