బత్తాయి పండులోని ఆరోగ్య విషయాలు...

శనివారం, 8 సెప్టెంబరు 2018 (10:43 IST)
బత్తాయితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం. బత్తాయిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుటకు సహాయపడుతుంది. బత్తాయిలోని రసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సమర్థంగా పనిచేస్తుంది. బత్తాయి రసాన్ని తరచుగా తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు ఉపయోగపడుతుంది.
 
బత్తాయిలోని పొటాషియం రక్తపోటును నివారించుటకు చక్కగా పనిచేస్తుంది. మూత్రపిండాలలో అనేక విషాలను బయటకు పంపుతుంది. బ్లాడర్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇందులోని క్యాల్షియం ఎముకల బలానికి మంచి ఔషధంగా సహాయపడుతుంది. మెదడు, నాడీవ్యవస్థ చురుగ్గా ఉండేందుకు బత్తాయి పండు చాలా ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు