సముద్ర చేపలు తింటే ఆయుష్షు పెరుగుతుందట!

బుధవారం, 28 జనవరి 2015 (13:55 IST)
సముద్ర చేపలు తింటే ఆయుష్షు పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సముద్రంలో లభించే చేపలను ఆహారంగా తీసుకోవడం ద్వారా వార్ధక్య లక్షణాలు అంత త్వరగా రావని వైద్యులు నిర్ధారించారు. 
 
చేపలు తినేవారికి ఆయుర్దాయం పెరుగుతుంది. చేపలు గుండె కొట్టుకోవడాన్ని సరిదిద్దుతాయి. రక్తంలోని ట్రైగ్లిసరిడ్స్‌ని తగ్గిస్తాయి. రక్తంలోని చక్కెరలను స్థిరీకరించగలిగిన శక్తి చేపలకుందని పరిశోధకులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి