పచ్చిమెులకలతో.. కంటి చూపు మెరుగు..?

బుధవారం, 26 సెప్టెంబరు 2018 (09:50 IST)
మెులకలు తినడం వలన ఆరోగ్యానికే కాదు అందానికి, శిరోజాల సంరక్షణకు చాలా ఉపయోగపడుతాయి. ఈ పచ్చిమెులకలను డెైట్‌లో తీసుకుంటే శరీర వేడిని తగ్గించే పోషక విలువలు వీటిలో అధికంగా ఉన్నాయి. జీర్ణశక్తికి మెులకలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. రక్తహీనతను తగ్గిస్తాయి. చిన్నారులలో న్యూరల్ ట్యూబ్స్ వంటి సమస్యలను నివారిస్తాయి. అధిక బరువును కూడా తగ్గిస్తాయి.
 
చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపుతాయి. అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ పచ్చిమెులకలు మంచిగా దోహదపడుతాయి. మెులకల్లోని విటమిన్ కె, సి, ఎ, మినరల్స్, మాంగనీస్, జింక్, మెగ్నిషియం, ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజాలు కంటి చూపును మెరుగుపరచుటకు చక్కగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  
 
శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మెులకలు తరచుగా ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు. ముఖ్యంగా బ్రొకోలీ వంటి మెులకలు ఆస్తమా వంటి అలర్జిక్ రియాక్షన్స్‌ను తగ్గిస్తాయి. మెులకల విషయంలో శుభ్రతను మాత్రం తప్పనిసరిగా పాటించాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు