చక్కెర, పెరుగులోని అద్భుత ఆరోగ్య చిట్కాలు..

సోమవారం, 1 అక్టోబరు 2018 (16:02 IST)
ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా.. అందుకు షాపులలో దొరికే మందులు వాడుతున్నారా.. వద్దు. బొద్దింకల కంటే వాటిని తొలగించుటకు వాడే మందుల  వలనే రకరకాల వ్యాధులు ఏర్పడుతుంటాయి. అందుకు బోరిక్ యాసిడ్ పౌడర్‌లో కొద్దిగా చక్కెర, పెరుగు, గోధుమ పిండి కలుపుకుని ఈ మిశ్రమాన్ని ఉండలుగా తయారుచేసుకోవాలి.
  
 
ఈ ఉండలను ఎక్కడైతే బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయో.. ఆ ప్రాంతాలలో వీటిని పెట్టుకోవాలి. దీంతో ఇంట్లోని బొద్దింకల నుండి విముక్తి లభిస్తుంది. తద్వారా బొద్దింకల వలన వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణు సూచిస్తున్నారు. అలానే చక్కెర పలు అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. ఆరోగ్యానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
చలికాలంలో పెదాలు, కాళ్ళు పగుళ్ళ ఏర్పడుతుంటాయి. అందుకు ఏం చేయాలంటే గ్లాస్ నీటిలో కొద్దిగా చక్కెర కలుపుకుని పెదాలకు, కాళ్ళకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ఈ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు