వేరుశెనగ నూనెలో ఇతర కూరగాయల్లో వుండే విధంగా ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. వేరుశెనగ నూనెలో ఉండే ధాతువులు ప్రమాదకరమైన కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది. వివిధ అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. వేరుశెనగ నూనెలో రెస్వెట్రాల్, పోలీఫెనాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలలో ఉన్నాయి. ఈ సమ్మేళనం ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి పనిచేస్తుంది.
వేరుశెనగ నూనె క్యాన్సర్‌ను నిరోధిస్తుంది. వేరుశెనగ నూనెలోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను నశింపజేస్తాయి. వేరుశెనగ నూనె అల్జీమర్స్ వ్యాధికి చెక్ పెడుతుంది. వేరుశెనగ నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యాంటీ ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తుంది. వేరుశెనగ నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని యంగ్‌గా హెల్దీగా ఉంచుతుంది.