ఆదివారం రెండు పూటల భోజనం ఉండేటట్లు చూసుకోవాలి. ఒక పూట మీకు నచ్చిన ఆహారం తీసుకోండి. ప్రతి రోజు వ్యాయామం చేయండి. కుదరకపోతే వారంలో కనీసం మూడు రోజులైనా వ్యాయామం చేయడం మంచిది. సోమ, మంగళ, బుధ వారాలైయితే మంచిది. ఎందుకంటే వారం చివరిలో మీరు బిజీగా ఉండొచ్చు కాబట్టి ఈ మూడు రోజులు మీరు వ్యాయామం చేస్తే మరుసటి మూడు రోజులు ఉత్సాహంగా ఉండగలరు.
వారంలో కనీసం నాలుగు రోజులైనా మీ ఇంటి నుండి భోజనం తీసుకొని రండి. దీనివల్ల బయట తిండి తగ్గుంది. ప్రోటీన్లు, కార్బోహైడ్రెట్లు సంమృద్ధిగా ఉన్న కూరగాయలును వాడండి. రాత్రి పూట వేగంగా నిద్రపోయి, ప్రోద్దునే మేల్కొండి. అప్పుడు మీరు పనిలో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. లేదంటే నిద్ర సరిపడక మీరు పని చేస్తున్నప్పుడు సమస్యలు వస్తాయి.
ప్రతిరోజు మూడు పూటల ఆహారం తీసుకోవడం మంచిది. అల్పాహారం ఉదయం 8 గంటలకు, మధ్యాహ్న భోజనం 1 గంటకు, రాత్రి భోజనం 7 గంటలకు తినడం ఉత్తమమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధమైనటువంటి ఆహారపు అలవాట్లు పాటించడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చు.