సైనస్ సమస్య, జలుబు వేధిస్తున్నాయా...?

సోమవారం, 3 ఆగస్టు 2015 (17:01 IST)
నేడు చాలామంది ఎక్కువగా శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కారణం వాతావరణ కాలుష్యం ఒకటయితే మిగిలినవి అనేకం. తరచుగా జలుబు, సైనస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. వీటిని చిన్నచిన్న సూత్రాలతో క్రమంగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
 
అవేమిటో ఒక్కసారి చూద్దాం...
1. వాహనాలలో ప్రయాణించేటపుడు ముక్కుకు కాటన్ వస్త్రాన్ని కట్టుకోవాలి.
2. ప్రతిరోజు పది నిమిషాల పాటు సూర్య కిరణాలు శరీరంపై పడేలా కూర్చోవాలి.
3. బయట ఆహార పదార్ధాలు తింటే ఓ గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగాలి.
4. నిద్ర పోయేప్పుడు తలపై పూర్తిగా దుప్పటి ఉండేట్లు కప్పుకోవాలి.

వెబ్దునియా పై చదవండి