బచ్చలికూర, పెరుగుతో కలిపి తింటే?

శుక్రవారం, 29 జనవరి 2016 (09:30 IST)
లవంగాలు, యాలకులు నోటిలో చప్పరిస్తూ నమిలి మింగితే నోటి దుర్వాసన పోతుంది.
బచ్చలికూర, పెరుగుతో కలిపి తింటే అతిసారం తగ్గుతుంది.
అరటి పండు రోజూ ఉదయం పరిగడుపున తింటే మలబద్దకం పోతుంది.
మందార పువ్వులు, గోరింటాకు, కలబంద గుజ్జు, నల్ల నువ్వుల నూనెలో వేసి కాచి వడబోసి తలకు రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా పెరగడమే కాదు తలనొప్పి కూడా తగ్గుతుంది.
పాలకూరను నూరి చక్కెర కలిపి తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి.
తేనె వేడి నీళ్లలో కలిపి తాగితే గుండె జబ్బులు దరిచేరవు.

వెబ్దునియా పై చదవండి