వర్షా కాలంలో ఎలాంటి వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి?

మంగళవారం, 15 జులై 2014 (17:57 IST)
చాలా మంది వర్షాల్లో తడుస్తూ అనారోగ్యం బారిన పడుతుంటారు. వర్షం వస్తుందని తెలిసినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెళుతుంటారు. దీంతో వర్షంలో తడిసిపోతుంటారు. వాస్తవంగా వర్షాలు పడుతున్నపుడు ప్రత్యేకంగా వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నట్టయితే అనారోగ్యం బారినపడకుండా ఉంటారు.
 
వర్షంలో బయటకు వెళ్లాల్సి వస్తే చేతిలో గొడుగు లేదా రెయిన్ కోటు తప్పనిసరిగా ఉంచుకోవాలి. అలాగే, వర్షపు నీటిలో తడిసినా కాళ్లకు అనువుగా ఉండే చెప్పులనే ధరించాలి. 
 
వర్షాకాలంలో వంటినిండా ఆభరణాలు ధరించడం మంచిది కాదు. చాలా సింపుల్‌గా, లైట్‌ వెయిట్‌గా ఉండే ఆభరణాలను మాత్రమే ధరించాలి. వాటర్ ఫ్రూప్ మేకప్‌ను తేలికగా ఉండేలా వేసుకోవాలి. 
 
భారీ హెయిర్ స్టయిల్స్ అస్సలు చేసుకోకూడదు. ఇవి వర్షాకాలానికి ఏమాత్రం సౌకర్యవంతంగా ఉండవు. వర్షపు జల్లులకు తడిసినా త్వరగా ఆరిపోవడానికి అనువైన హెయిర్ స్టయిల్స్‌ను అనుసరించడం చాలా ఉత్తమం. 

వెబ్దునియా పై చదవండి