పేగుల్లోని వ్యర్థాలను సులభంగా తొలగించాలంటే..? (video)

మంగళవారం, 2 జూన్ 2020 (17:35 IST)
Stomach
శరీరంలోని మలినాలను సులభంగా తొలగించుకోవాలంటే నీటిని ప్రధానంగా తీసుకోవాలి. అందుకే ఉదయం నిద్రలేచి.. ఒక గ్లాసుడు గోరువెచ్చని నీటిని సేవించాలి. ఇలా చేస్తే పొట్టలోని వ్యర్థాలు తొలగిపోతాయి. ఇంకా ఆ గోరు వెచ్చని నీటిలో తేనె ఒక స్పూన్, లెమన్ జ్యూస్ ఒక స్పూన్ కలిపి తీసుకుంటే మెటబాలిజం మెరుగు అవుతుంది. 
 
ఇంకా రోజుకు 8-10 గ్లాసుల నీటిని సేవించాలి. నీటిని సేవించడం ద్వారా శరీరంలో అవయవాలను శుభ్రం చేసుకోవచ్చు. అందుకే పరగడుపున నీటిని సేవించడం మరిచిపోకూడదు. అర లీటరు నుంచి ఒక లీటర్ వరకు తాగడం చేయొచ్చు. 
 
అలాగే పొట్ట పేగుల్లోని వ్యర్థాలను తొలగించుకోవాలంటే.. రోజూ ఓ ఆపిల్‌ను తీసుకోవాలని.. రోజూ ఉదయం ఓ గ్లాసుడు ఆపిల్ జ్యూస్ సేవించడం మంచి ఫలితాన్నిస్తుందని వైద్యులు చెప్తున్నారు. 
 
నిమ్మరసంలో విటమిన్ సి, యాంటీ యాక్సిడెంట్లు వున్నాయి. లెమన్ జ్యూస్, ఉప్పు, తేనే చేర్చి గోరు వెచ్చని నీటిని ఉదయం పూట సేవించడం ద్వారా మలబద్ధకం తొలగిపోతుంది. రాస్బెర్రీ, ఆపిల్స్, బఠాణీలు, బ్రోకోలీతో పాటు చిరు ధాన్యాలు, తృణ ధాన్యాలు తీసుకోవచ్చు. ఇవన్నీ పొట్టలోని పేగుల్ని సులభంగా శుభ్రం చేస్తాయి. 
 
క్యారెట్, కీరదోస, క్యాబేజీ, బీట్ రూట్, టమోటా, ఆకుకూరలు, కూరగాయల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలను కూడా జ్యూస్ రూపంలో చేర్చుకోవచ్చు. ఇవి పొట్టలోని పెద్ద పేగుల్లోని వ్యర్థాలను తొలగిస్తాయి. 
juice
 
ఇకపోతే.. కలబంద రసంలో కాస్త లెమన్ జ్యూస్ కలుపుకుని రోజుకు మూడు లేదా నాలుగు సార్లు తీసుకుంటే అజీర్తి వుండదు. చర్మ సమస్యలుండవు. తలనొప్పి తొలగిపోతుంది. అల్లం రసాన్ని తేనెతో కలిపి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే పొట్టలోని పేగులు శుభ్రమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు