రక్తపోటును నియంత్రించేందుకు ఇలా చేస్తే సరి..

మంగళవారం, 21 నవంబరు 2017 (20:56 IST)
బీపీ...  రక్తపోటును నియంత్రించాలంటే కొన్ని చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ముఖ్యంగా శరీరంలో క్యాల్షియం స్థాయి తగినంతగా ఉండేట్లు చూసుకోవాలి. రోజూ క్యాల్షియం సమృద్ధిగా అందే కొవ్వు లేని వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తులు వంటివి తీసుకోవాలి. పెరుగును రోజూ తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రించవచ్చు.
 
శరీరానికి కావాల్సిన పొటాషియం అందాలంటే అరటిపండ్లు, బత్తాయి, దోసకాయ, టమాటాలు, ఉప్పు లేకుండా వేయించిన వేరుశెనగ, బీన్స్, బంగాళాదుంపలు, మునగాకు, కొత్తిమీర వంటివి తీసుకోవాలి. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తపోటును నియంత్రించాలంటే ముఖ్యంగా రోజువారీ ఆహారంలో తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు, గింజలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు