నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు మౌత్ వాష్‌లని, చూయింగ్ గమ్‌లని ఎక్కువగా తీసుకుంటుంటారు. అలా కాకుండా సహజ పద్ధతుల్లో నోటి దుర్వాసనను నివారించుకోవచ్చు. నోటి దుర్వాసనకు ఉప్పు నీరు మేలు చేస్తుంది. ప్రతి రోజు ఉదయం బ్రష్ చేసిన తరువాత తప్పనిసరిగా ఉప్పు నీటితో నోటి శుభ్రం చేసుకుంటే చక్కని ఫలితం దక్కుతుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కళ్లుప్పు వేసుకుని కలిపి దానిని రోజులో రెండు మూడు సార్లైనా పుక్కిలించాలి. అదీ ఆహారం తీసుకున్న తర్వాత ఇలా చేయడం ద్వారా నోరు శుభ్రమవతుంది. ఇంకా దుర్వాసన వుండదు. రోజులో కనీసం రెండు మూడు లవంగాలు, సోంపు వంటివి తింటుండాలి. ఇందులో ఉండే మంచి లక్షణాలు నోట్లోని బ్యాక్టీరియాను దూరం చేస్తాయి.
కొంచెం మిరియాల పొడి, పసుపు, కాస్త ఉప్పు, అందులో నువ్వుల నూనె వేసి పేస్టులా చేసుకుని ఈ పేస్ట్‌తో పళ్లను తోమితే నోటి దుర్వాసన వుండదు. తద్వారా పంటి సమస్యలు తీరడంతో పాటు నోటి దుర్వాసన తగ్గుతుంది. ఔషధగుణాలున్న నిమ్మరసంతో బ్రష్ చేయడం వల్ల దుర్వాసనను తగ్గించుకోవచ్చు.