శరీరంలో రక్తం వృద్ధి చెందాలంటే ఏం చేయాలి?

గురువారం, 20 ఏప్రియల్ 2017 (15:28 IST)
ప్రస్తుతం చాలామంది రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. తినే ఆహారంలో సరైన జాగ్రత్తలు లేకపోవడంతో రక్తహీనతను ఎదుర్కొంటున్నారు. ప్రతి వెయ్యిమందిలో 50 మందికి పైగా రక్తహీనతను ఎదుర్కొంటున్నారని వైద్యులే చెబుతున్నారు. అయితే రక్తహీనత నుంచి బయటపడాలంటే ఇలా చేయాలి.
 
చిలకడ దుంపల్ని మెత్తగా ఉడికించి తినాలి. అలాగే నేరేడుపండ్ల రసం ప్రతిరోజూ రాత్రిపూట తాగితే రక్తవృద్ధి కలగడమేకాక శుద్ది కూడా అవుతుందట. సపోటా పండ్లు ప్రతిరోజూ క్రమంతప్పకుండా తిన్నా, టమోటాలను గింజ లేకుండా తీసి ఆ రసాన్ని ఉదయం పూట తాగితే రక్తవృద్ధికి కారకం అవుతుందట. 
 
అంతేకాదు ద్రాక్షకు రక్తాన్ని శుభ్రపరిచే గుణం వుంది. ప్రతిరోజూ ఒక ఆపిల్ పండు తిన్నా రక్తం వృద్ధి చెంది శరీరానికి మంచి బలం చేకూర్చుతుందట. ఇలా తు.చ తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా ఆరోగ్యవంతులవుతారని వైద్యులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి