ఇపుడు ప్రతి ఒక్కరినీ అధిక బరువు సమస్య వేధిస్తోంది. ఫలితంగా చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉపవాసాలు, వ్యాయామాలు వంటి లేనిపోని కసరత్తులు చేస్తుంటారు. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ... బరువు తగ్గేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామనే ధీమాతో ఆహారాన్ని పుష్టిగా లాగించేస్తుంటారు. ఇలాచేయడం వల్ల బరువు తగ్గడం సంగతి అటుంచితే.. మరింతగా బరువు పెరిగే అవకాశం ఉంది. నిజంగా బరువు తగ్గాలనుకునేవారు ఇలా చేయకుండా ఉంటేచాలు.
* రోజూ వ్యాయామం చేస్తున్నాం, సరైన పోషకాహారం తీసుకుంటున్నాం కదా అని చెప్పి వేగంగా ఫలితాన్ని ఆశిస్తారు. బరువు తగ్గడం అనేది నిజానికి కొందరిలో నెమ్మదిగా ప్రారంభమవుతుంది. ఒక్కసారి బరువు తగ్గడం ప్రారంభమైతే ఇక మీరు ఆగమన్నా బరువు తగ్గడం మాత్రం ఆగదు.
* వ్యాయామం చేస్తున్నాంకదాని అధిక ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటారు. అలా చేయడం వల్ల బరువు తగ్గకపోగా, ఎప్పటికీ అదే బరువులో కొనసాగుతారు. కనుక బరువు తగ్గాలనుకునే వారు రోజూ ప్రోటీన్లను తగిన మోతాదులోనే తీసుకోవాలి.